భీమారం మండలంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. జైపూర్ మండల కేంద్రంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జైపూర్ లో క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందంటూ.. క్రీడాకారులు చాలా ఉత్సాహంగా ఉన్నారన్నారు. క్రీడాస్ఫూర్తితో ఆడాలన్నారు.
Also Read :- ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని సన్మానించిన బట్టి గూడెం కాలనీ వాసులు
భారతదేశంలో చాలా క్రికెట్ ఆడుతున్నారని... తాను దుబాయ్ వెళ్లినప్పుడు అక్కడ పిల్లలు కూడా ఎక్కువ మంది క్రికెట్ ఆడుతున్నారనన్నారు. తాను హెచ్ సీ ఏ ప్రెసిడెంట్ గా ఉన్నపుడు గ్రామీణ ప్రాంత యువతలో క్రీడలను ప్రోత్సహించానని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో క్రికెట్ ను ప్రోత్సహించి.. కావలసిన నిధులను సమకూర్చి .. క్రీడాకారుల ప్రతిభను వెలికితీయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.