మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. చెన్నూరు పుప్పాల హనుమాన్ వీధిలో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. రూ, 2 కోట్లతో చేపట్టే సీపీ రోడ్, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. చెన్నూరు మున్సిపాల్టీలో సీసీ రోడ్లు.. డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్తంగా ఉందంటూ... ఎన్నికల సమయంలో అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ALSO READ | కేసీఆర్ ముందు నిలబడ్తవా?..సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చెన్నూరు మున్సిపాల్టీలో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టామన్నారు. చెన్నూరు మున్సిపాల్టీలో రోడ్లు సరిగా లేవని.. అస్థవ్యస్తంగా డ్రైనైజీ ఉందని .. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ప్రజలు చెప్పారని ఎమ్మల్యే వివేవ్ వెంకటస్వామి అన్నారు. ఈ మూడు రంగాలను అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. ఇప్పటికే చెన్నూరు ప్రజలకు తాగు నీరు అందించేందుకు అమృత్ పథకం ద్వారా వాటర్ ట్యాంక్ లు నిర్మాణం చేపట్టామన్నారు.
ఇ