రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భీమారం మండలం ఎల్బీపేటలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి భూమి పూజ చేశారు.  సంక్షేమ పథకాల అమలు తీరును అధికారులను.. ప్రజలను అడిగి తెలుసుకున్నారు.  కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.

Also Read :- క్రీడాకారులు స్పూర్తితో ఆడాలి.. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన భీమారం మండలం ఎలకేశ్వరం గ్రామానికి చెందిన  మడే మహేష్ ను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని పరామర్శించారు. మద్దికల్ శివారులో వరి నాట్లు వేస్తున్న మహిళలతో ముచ్చటించారు.