- చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కోల్ బెల్ట్/ బెల్లంపల్లి, వెలుగు : బీజేపీ దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. శుక్రవారం బెల్లంపల్లి పద్మశాలి భవనంలో నిర్వహించిన నేతకాని మహార్ ఆత్మీయ సమ్మేళనానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి ఆయన హాజరయ్యారు. నేతకాని కులస్తులు తన వద్దకు వచ్చి సమస్యలు, బాధలు చెప్పుకున్నారన్నారు.
నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు , నిధులు మంజూరు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేయగా, ఆయన ఒకే చెప్పారన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తాని వంశీ హామీ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ దళితుల కోసం చేసిందేమీ లేదని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అన్నారు.
నేతకాని మహర్ హక్కుల సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షుడు గోమాస శ్రీకాంత్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండగుర్ల వేద ప్రకాశ్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దుర్గం గోపాల్, రత్నం ప్రదీప్ ,జాడి మహేశ్ ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం నిర్వహించారు.