అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో 20 వేల ఎకరాలను కేసీఆర్ దండుకున్నాడని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజక వర్గంలోని కాసిపేట మండలం యాప గ్రామంలో జరిగిన కార్నర్ మీటింగ్ లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్ అహంకారం, అవినీతి పాలనతో ప్రజలు విసుగు చెంది ఓడించారన్నారు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య వ్యవహార శైలి చెప్పుకోవడానికి మాటలు రావన్నారు.
కేసీఆర్ కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు దోచుకున్నాడని ఫైర్ అయ్యారు. ప్రజల సొమ్మును దుర్విని యోగం చేసిండన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ రూ.7 లక్షల అప్పులపాలు చేసిండని ఆరోపించారు. మోడీ పాలనలో ధరలు పెరిగాయన్నారు. పడేండ్లలో 30కోట్లు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదన్నారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీని 2 లక్షల మెజారిటీ తో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. వంశీ గెలిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ రాగానే 60 వేల ఉద్యోగాలిచ్చామని తెలిపారు.