యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులు, తనయుడు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి వచ్చిన ఆయన ఇవాళ ఉదయం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేదాశీర్వాదం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు . అంతకుముందు కళ్యాణకట్టలో తన మనవడికి పుట్టు వెంట్రుకలు తీయించి మొక్కు తీర్చుకున్నారు.
వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ బరిలో దిగుతుండగా.బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వంశీకృష్ణ స్పీడ్ పెంచారు. ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.