చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టులో ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. పెద్దపల్లి ఎంపీగా ఇటీవల అత్యధిక మెజారిటీతో గెలిచారు వంశీకృష్ణ. ఎంపీగా తొలిసారి కుటుంబ సభ్యులతో కలిసి జూన్ 8న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీచేసిన గడ్డం వంశీకృష్ణ ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పై లక్షా 30 వేల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మూడో స్థానానికే పరిమితమయ్యారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజవర్గంలో 15 లక్షల 96 వేల 430 ఓట్లకుగాను 10లక్షల 83వేల 453 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు 4లక్షల 80వేల 994 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి గొమాసే శ్రీనివాస్‌కు 3లక్షల 49వేల 339 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు 1లక్షల 94వేల 821 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1లక్షల 31వేల 771 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.