కరీంనగర్ టౌన్,వెలుగు : కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని రంగినేని గార్డెన్ లో గురువారం జరిగిన మున్సావత్ స్వాతి, భాస్కర్ నాయక్ దంపతుల కూతురు అర్చన వివాహానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. నూతన దంపతులను వివేక్ వెంకటస్వామి ఆశీర్వదించారు. వివేక్ తోపాటు చెన్నూరు కాంగ్రెస్ నేత దుర్గం నరేశ్ తదితరులు ఉన్నారు.
నామకరణ వేడుకల్లో
పెగడపల్లి : పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామానికి చెందిన వివేక్ వెంకటస్వామి అభిమాని జొన్నల అమరేందర్ రెడ్డి-శిరీశ దంపతులకు కొడుకు జన్మించగా గురువారం నామకరణ వేడుకలు జరిగాయి. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరై చిన్నారికి వెంకట్ సుముక్ రెడ్డి గా నామకరణం చేశాడు.