మాలల సింహగర్జనను విజయవంతం చేయండి...ఎమ్మెల్యే వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి పిలుపు

మాలల సింహగర్జనను విజయవంతం చేయండి...ఎమ్మెల్యే వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి పిలుపు
  • పరిగిలో సింహగర్జన వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆవిష్కరణ

పరిగి, వెలుగు: సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పరేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1న నిర్వహించనున్న మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి పిలుపునిచ్చారు. సోమవారం వికారాబాద్ జిల్లా పరిగిలో మాలల సంఘం నాయకులతో కలిసి సింహగర్జన వాల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించి, మాట్లాడారు. రాష్ట్రంలో మాలలను పట్టించుకోకపోయిన పర్వాలేదనే ఆలోచనలో పలు రాజకీయ పార్టీలు ఉన్నాయన్నారు.

జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నారని, రెండవ అతి పెద్ద జనాభా మాలలదే అని పేర్కొన్నారు. మాలల హక్కులు, ఆత్మగౌరవం గురించి సమాజం చర్చించుకునేలా ఈ సభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ‘జాగో మాల’నినాదంతో అన్ని జిల్లాలకు చెందిన మాలలు అధిక సంఖ్యలో ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షులు వెంకటయ్య, శివరాజు, అడ్వకేట్ ఆనందం, బాయికాడ వెంకట్, కోళ్ల యాదయ్య, పాలేపల్లి నర్సింహులు, సైదుపల్లి రాములు, కూల్కచెర్ల లక్ష్మయ్య విజయ్,కంకల్ వీరేశం, మంచనపల్లి లక్ష్మణ్, కులక్చర్ల శీను, లక్నాపూర్ యాదయ్య, నర్సింలు, పూడూరు కండ్లపల్లి అబ్రహం, డాక్టర్ బుచ్చిబాబు, శ్రవణ్, మాల మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాజీ జడ్పీటీసీ రామకృష్ణ, అంబేద్కర్ విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి మంచనపల్లి శ్రీనివాస్, అంబేద్కర్ విజ్ఞాన వేదిక నియోజకవర్గం అధ్యక్షుడు నర్సింలు, ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింలు, మాణిక్యం పాల్గొన్నారు.