కోల్ బెల్ట్: జీవో నెంబర్ 111 ఉల్లంఘిస్తున్నామని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తానేప్పుడు చట్టానికి లోబడి పనిచేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పష్టంచేశారు. రూల్స్ప్రకారమే ఫామ్హౌజ్నిర్మాణం చేపట్టామని.. ఈ విషయంలో కేటీఆర్ పై పరువునష్టం దావావేస్తానని తెలిపారు. బీఆర్ఎస్నేతల అసత్య ఆరోపణలను సహించేది అన్నారు. చెన్నూరులోని తన క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివేక్మాట్లాడారు.
హైడ్రా చట్టం ప్రకారం నా ఫాంహౌజ్ లేదని.. చర్యలు తీసుకోవాలని తప్పుడు ప్రచారం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న. కేటీఆర్ప్రోత్సాహంతోనే నాపై తప్పుడు ప్రచారం చేస్తుండ్రు. ఎఫ్ టీఎల్ ద్వారా 30 మీటర్ల తర్వాత ఏదైనా కట్టుకోవచ్చని చట్టం ఉంది.. రూల్స్మేం ఉల్లంఘించలేదు. కేటీఆర్ కు నేను ఛాలెంజ్ చేస్తున్న. నీకు దమ్ముంటే నిరూపించు.. లేకపోతే డిఫమేషన్కేసు వేస్త ’అని స్ట్రాంగ్వార్నింగ్ఇచ్చారు.
అధికారం పోయిందని ఫ్రస్టేషన్
‘రాష్ట్రంలో కేసీఆర్, బీఆర్ఎస్ నిరంకుశపాలనకు వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేశాను. మా మీడియా సంస్థకు యాడ్స్ఇవ్వనప్పటికీ వారి అవినీతిపై కోట్లాడం. దుబ్బాక ఉప ఎన్నికల సమ యంలో నా ఆఫీస్ నుంచి రూ.కోటి పట్టుకున్నామని నన్ను బదన్నాం చేశారు. తర్వాత నా ఫోన్ ట్యాంపింగ్ చేశారు. తెలంగాణలో ఏ నాయకుడు ఎదగవద్దని, అందరి గొంతులు కోయాలని కుట్రలు చేశారు. బీజేపీ– బీఆర్ఎస్ కుమ్మకై నాపై అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈడీతో రెయిడ్స్ చేయించారు.
ప్పటి వరకు నాపై చేసిన ఆరోపణల్లో ఒకటి కూడా నిరూపించలేదు. నేను తప్పు చేస్తే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు. కేటీఆర్ అధికారం పోయిన తర్వాత ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నాడు. పదేండ్లు ప్రజలను ఇబ్బంది పెట్టామనే సోయిలేకుండా వ్యవహరిస్తున్నాడు. ఫ్రస్టేషన్ లో తప్పుడు వార్తలు సృష్టిస్తున్నాడు’ అని వివేక్మండిపడ్డారు.