
పేద ప్రజలకు సాయం చేసేందుకు ముందు వరుసలో ఉంటామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రవీంధ్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో.. మాష్టార్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో .. మా భారత భాగ్య విదాత... అంబేద్కర్ ఆడియో వీడియో ఆవిష్కరణ సభకుచెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ మన అందరికి స్ఫూర్తి అంటూ.... అంబేద్కర్ ఆశయాలను మర్చిపోవద్దు ..... అతను మన అందరికి దారి చూపిన వ్యక్తి అని అన్నారు. తాను 110 అంబేద్కర్ విగ్రహాలు పెట్టడానికి సహాయం చేశానని తెలిపారు.
మాష్ఠార్జీ రచించి పాడిన పాటను ఆవిష్కరించిన ఆయన ..... పేద ప్రజలకు సాయం చేసేందుకు ముందు వరుసలో ఉంటామని తెలిపారు. తనకు.. తన తండ్రిగారైన వెంకటస్వామికి మాష్టార్జీతో ఎంతో పరిచయం ఉందన్నారు .తాను దళితుల హక్కుల కోసం,దళితుల సంక్షేమ పథకాల కోసం పోరాటంలో ఎప్పటికి ముందు వరుసలో ఉంటానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అన్నారు.. మాష్ఠార్జీ ఎన్నికల సమయంలో వెంకటస్వామి పై పాటలు పాడి... దళితులకు ధైర్యం కలిగించినందుకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృతఙ్ఞతలు తెలిపారు.
దళితుల కోసం తమ తండ్రి వెంకటస్వామి ఎంతో పోరాటం చేశారని.. మాకు కూడా అదే కల్చర్ నేర్పించారని తెలిపారు. పేద ప్రజల పిల్లల కోసం డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కళాశాల ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయిలో విద్య ను అందిస్తున్నామంటూ...75 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు. మాల కమిటీలో విశ్వాసం ఉండాలంటూ .. బడ్జెట్ లో 18 శాతం రిజర్వేషన్ పెట్టాలని డిమాండ్ చేశానన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దళితులను కూడా రాజీవ్ యువ వికాస్ లో చేర్చారని.. ఆ పథకాన్ని ఉపయోగించికోవాలని తెలిపారు. దళిత IAS, IPS అధికారులు ... దళిత పిల్లలకు సహాయ సహకారాలు అందించి... మన జాతి లో విశ్వాసం కల్పించాలని కోరారు.