సుప్రీంకోర్టు తీర్పుతో మాలల్లో ఐకమత్యం వచ్చింది : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

సుప్రీంకోర్టు తీర్పుతో మాలల్లో ఐకమత్యం వచ్చింది : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

కంటోన్మెంట్​ నియోజకవర్గంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ ల రిజర్వేషన్​ కు   సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు పై అవగాహన కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపిన నేతలకు సంఘాభావం తెలిపారు.   ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పుతో మాల కమ్యూనిటీ ప్రజల్లో ఐకమత్యం  వచ్చిందనంటూ.. నాగర్​ కర్నూలు సభలో చాలామంది  పాల్గొన్నారని  ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు.  హైదరాబాద్​ లో సభ పెట్టేందుకు కమిటి వేశామన్నారు.  

డిసెంబర్​ 1 న హైదరాబాద్​ లో మాలల మహాసభ ఉంటుందని... మన జాతి.. మన హక్కులను మనమే కాపాడుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదు.. బస్తీ బస్తీకి తిరిగి.. ఎస్సీ వర్గీకరణ గురించి వివరించాలన్నారు.   గతంలో మానాన్నగారు మీ వెంట ఉన్నారని.. ఇప్పుడు నేను ఉంటానన్నారు.  మా నాన్న గారు చాలా సేవలు చేశారని. . మాది  ప్రజలకు సేవ చేసే కుంటుంబం అని అన్నారు.  జాగో మాల ద్వారా అందరిని చైతన్యపరచాలని.. మనమంతా కలిసి అన్ని రాజకీయ పార్టీలకు స్ట్రాంగ్​ వార్నింగ్​ ఇవ్వాలన్నారు.  నాయకుల చేతిలో ఏమీ ఉండదని.. ప్రజల ఒత్తిడిమీదనే ఆధారపడి ఉంటుందని ... అందరూ బయటకు రావాలని సూచించారు.   

ALSO READ : నర్సింగ్​ కాలేజీల్లో అడ్మిషన్లను పూర్తి చేయండి

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట  సమితి కన్వీనర్  చెన్నయ్య మాట్లాడుతూ...  మాలలందరూ ఐక్యంగా పోరాడాలంటూ.. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి మన వెంట ఉంటారన్నారు,  ఖబడ్డార్​ మందకృష్ణ అంటూ.. మాలల సంక్షమం కోసం పోరాటం చేస్తామని చెన్నయ్య అన్నారు.  మాలల హక్కులను కాపాడేందుకు కేంధ్రప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు.