తానే సీఎం అయితాననే ఆశతో.. పార్టీని పతనం చేసిన ఘనుడు

తానే సీఎం అయితాననే ఆశతో.. పార్టీని పతనం చేసిన ఘనుడు

కోల్ బెల్ట్ :  పార్లమెంట్​ఎన్నికల్లో బీఆర్ఎస్​పార్టీ ఓటమికి బీఆర్ఎస్ వర్కింగ్​ప్రెసిడెంట్​కారకుడు అయ్యాడని,  కేటీఆర్​ఫెయిల్యూర్​ లీడర్​అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి విమర్శించారు.  తానే సీఎం అవుతాననే ఆశతో పార్టీని లీడ్​చేసి, పార్టీని పతనం చేసిన ఘనుడు కేటీఆర్ అని ​అన్నారు.  ఇవాళ  మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో స్థానికులతో కలిసి ఎమ్మెల్యే  వివేక్​ మార్నింగ్​వాక్​చేశారు. వార్డుల్లో తిరుగుతూ స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  సంబంధిత అధికారులకు ఫోన్​లో ఆదేశించి సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించారు.  మందమర్రిలో లెదర్​పార్కు భూములు ఆక్రమణకు గురవుతున్నట్లుగా స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.  

ఈ మేరకు లెదర్​పార్క్​భూమి మీదుగా సోలార్​ ఫ్లాంట్​కు వెళ్లేందుకు తీసిన రోడ్డును ఎమ్మెల్యే పరిశీలించారు.  ఈ విషయాన్ని అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కాకా వెంకటస్వామి సెంట్రల్​మినిస్టర్​గా ఉన్నప్పుడు లీడ్​ క్యాప్​ ద్వారా ఇక్కడ లెదర్​పార్కు ఏర్పాటుకు చొరవ తీసుకున్నట్లుగా ఆయన గుర్తు చేశారు. ‘  రాష్ట్రంలో లీడ్​క్యాప్​కు విలువైన భూములు ఉన్నాయి.  అసంపూర్తిగా ఉన్న లెదర్​పార్కు పునరుద్దరణకు సీఎంతో మాట్లాడాను.  

కులగణన తర్వాత దీనిపై సీఎంతో మరోసారి చర్చిస్తా.  లెదర్​పార్క్​పునరుద్దరణకు కృషి చేస్త.  ఇప్పటికే రూ. 10 లక్షలతో లెదర్​ పార్క్​ భవనం కంప్లీట్​చేశాం.  మరో రూ. 20 లక్షలను డీఎంఎఫ్​టీ ఫండ్స్​నుంచి కేటాయిస్తున్న.  లెదర్ పార్క్ భూమి లో సింగరేణి సోలార్ ప్లాంట్ కు భూమిని  కేటాయించిన అంశంపై సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి లెదర్ పార్క్ స్థలానికి నష్టం కలగకుండా చూస్తా.  కార్పొరేషన్ల పేరుతో గత బీఆర్ఎస్ సర్కార్ ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపింది.  కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు, మిషన్ భగీరథ పేరుతో  రూ. 40 వేల కోట్లను  అప్పటి బీఆర్ఎస్​  ప్రభుత్వం అవినీతికి పాల్పడింది.   అవినీతి సొమ్మును కక్కించాలని సీఎంను కోరుతున్న.   

ALSO READ : రూ.100 కోట్లతో డ్రింకింగ్ వాటర్ సప్లై : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

పదేళ్లు బీఆర్ఎస్ లీడర్లు అవినీతితో వేలకోట్లు దండుకున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోని కేటీఆర్ కేవలం అబద్ధాలు చెప్పుకోవడానికి పరిమితమయ్యాడు.  
మూసీ ప్రాజెక్టుకు రూ. 1500 కోట్లను ప్రభుత్వం నిర్ణయిస్తే..  కేటీఆర్ లక్ష కోట్లు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, ఇస్తామని మాట తప్పారు.  పదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు చేయలేదో  కేటీఆర్​ ఆత్మ విమర్శ చేసుకోవాలి’ అని ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు.