మంచిర్యాల: క్యాతన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని..కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు వివేక్ వెంకటస్వామి. బిడ్జి నిర్మాణం నాణ్యతలో రాజీపడొద్దని అధికారులు, కాంట్రాక్టరును ఆదేశించారు.
బిల్లుల విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మాట్లాడి ఇప్పిస్తాం.. పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ ను కోరారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం చెల్లిస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంటకస్వామి.