రైతు భరోసాపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలన్న కేటీఆర్ వ్యాఖ్యలకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కౌంటర్ ఇచ్చారు.
కౌలు రైతులను గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదన్నారు వివేక్. రైతులను మోసం చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు కౌలు రైతులకు ఎందుకు సాయం చేయలేదని ప్రశ్నించారు వివేక్. కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని కోరా..ఆనాడు కౌలు రైతులకు ఇచ్చేది లేదని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు కౌలు రైతులను పట్టించుకోని బీఅర్ఎస్ కు ఇప్పుడు కౌలు రైతుల గురించి మాట్లాడే హక్కులేదన్నారు. కౌలు రైతులు 90 శాతం ఎస్సీ,ఎస్టీ వాళ్లే ఉన్నారని చెప్పారు ఎమ్మెల్యే వివేక్. సాగు చేయని వారికి రైతు బంధు ఇచ్చినట్లు కేటిఆర్ ఒప్పుకున్నారని చెప్పారు.
ALSO READ : అసెంబ్లీలో మంత్రి కోమటి రెడ్డి vs కేటీఆర్ మధ్య మాటల యుద్ధం
అనంతరం వివేక్ వ్యాఖ్యలపై మాట్లాడిన కేటీఆర్.. మంత్రి కాకున్నా వివేక్ మాట్లాడారు..ఆయన మంత్రి కావాలని కోరుకుంటున్నా..ఆయన మా దోస్త్..మా సోదరుడు అని అన్నారు.