
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లాగ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనవసరంగా సింగరేణి సంస్థ విషయాల్లో జోక్యం చేసుకోరన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కార్మికులకు యాజమాన్యం నుంచి ఇబ్బందులు వస్తే పోరాటం చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కార్మికుల వైపు ఉన్నారని చెప్పారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయబోమని రాహుల్ చెప్పారన్నారు.
మందమర్రిలోని INTUC కార్యాలయంలో కార్మిక సంఘం ముఖ్య నాయకులతో గుర్తింపు సంఘం ఎన్నికలపై సమావేశం వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు కొత్త క్వార్టర్స్ ఇప్పిస్తామన్నారు. బీఆర్ఎస్ టీబీజీకేఎస్( TBGKS) యూనియన్ పై ఉన్న వ్యతిరేకతను కార్మికులు అసెంబ్లీ ఎన్నికల్లో చూపించారన్నారు వివేక్ వెంకటస్వామి. సింగరేణి ఏరియాలో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే ను గెలిపించకుండ కార్మికులు చెంపదెబ్బ కొట్టారని విమర్శించారు. 27 వ తేదీన కార్మికులు గడియారం గుర్తుకి ఓటు వేసి INTUC ని గెలిపించాలని కోరారు.
కాకా వెంకటస్వామి సింగిరేణి కార్మికులకు, ఉద్యోగులకు పెన్షన్ ఇప్పించారని చెప్పారు. కోట్ల మందికి మన దేశం పెన్షన్ ఎలా ఇస్తున్నారన ఇతర దేశాలు స్టడీ చేస్తున్నాయని చెప్పారు వివేక్ వెంకటస్వామి.