చెన్నూరులో ఎమ్మెల్యే వివేక్ మార్నింగ్ వాక్.. ప్రజా సమస్యలపై ఆరా

చెన్నూరులో ఎమ్మెల్యే వివేక్ మార్నింగ్ వాక్.. ప్రజా సమస్యలపై ఆరా

మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ నగర్, భేతాళ వాడలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు స్ధానికులు. అధికారులతో మాట్లాడి వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామి ఇచ్చారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.

రైల్వే బ్రిడ్జి పనుల ఆలస్యంపై ఆగ్రహం

 జూన్ 29న కూడా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి  కోల్ బెల్ట్ ఏరియాలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే పదేండ్లు దాటినా క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు పూర్తికాలేదని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి అన్నారు. క్యాతనపల్లి రైల్వే గేట్ వద్ద జరుగుతున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను శనివారం ఉదయం పరిశీలించారు. 

పనుల ఆలస్యంపై సంబంధిత కాంట్రాక్టర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు సకాలంలో పూర్తిచేయాలని, నిర్లక్ష్యం చేస్తే సహించబోనని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్యాతనపల్లి రైల్వే గేట్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో ప్రజల ఇబ్బందులను దూరం చేసేందుకు తాను పెద్దపల్లి ఎంపీగా పనిచేసిన కాలంలో కేంద్రాన్ని ఒప్పించి బ్రిడ్జి కోసం రూ.33 కోట్లు మంజూరు చేయించిన్నట్లు చెప్పారు. బీఆర్​ఎస్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే పదేండ్లు దాటినా పనులు పూర్తికాలేదని మండిపడ్డారు. గేట్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అందుకే ఎమ్మెల్యే కాగానే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు పూర్తిచేయించడంపై ఫోకస్​పెట్టినట్లు చెప్పారు. 4 నెలల్లో బ్రిడ్జి పనులు పూర్తి చేయించనున్నట్లు హామీ ఇచ్చారు.