
చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థానికులతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. స్థానిక సమస్యలు తెలుసుకున్న ఆయన సిసి రోడ్లు, డ్రైనేజీ ల నిర్మాణాలను వెంటనే చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం చెన్నూరు క్యాంప్ కార్యాలయంలో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. దీపావళి పండుగ సందర్భంగా సంప్రదాయంగా నిర్వహిస్తున్న కొల తిప్పడం కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి పాల్గొన్నారు.