మన రాజ్యాంగం ప్రపంచంలోనే బెస్ట్..మార్చాలని చూస్తే ప్రజలు ఒప్పుకోరు: వివేక్ వెంకటస్వామి

మన రాజ్యాంగం ప్రపంచంలోనే బెస్ట్..మార్చాలని చూస్తే  ప్రజలు ఒప్పుకోరు: వివేక్ వెంకటస్వామి

మన రాజ్యాంగం ప్రపంచంలోనే బెస్ట్ వన్ అని అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ ఫిలింనగర్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.  ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి..  రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే దేశ ప్రజలు ఒప్పుకోరన్నారు.  బీద ప్రజల ప్రొటెక్షన్ తో పాటు అన్ని వర్గాలను కలుపుకొని దేశాభివృద్ధి కోసం రాజ్యాంగాన్ని రాశారని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూసిన వారు రాష్ట్రంలో ఓడిపోయారని అన్నారు.  అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో  రాజ్యాంగాన్ని రాశారని చెప్పారు వివేక్ వెంకటస్వామి.  ఆయనకు ప్రతీ ఒక్కరు రుణపడి ఉండాలన్నారు.

Also Read :- మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధర

రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కులు

దేశానికి గొప్ప రాజ్యాంగం అందించిన మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు.  ఎన్నో కష్టాలను ఎదుర్కొని చక్కటి రాజ్యాంగాన్ని అందించారని చెప్పారు. కులమత భేదాలు  లేకుండా ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో హక్కులు కల్పించారని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపైన ఉందన్నారు. అంబేద్కర్ చూపించిన మార్గంలో మనందరం ముందుకెళ్లాలని సూచించారు.