లెదర్​పార్కు రీఓపెన్​కు కృషి : వివేక్​ వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రిలో లెదర్ పార్కును రీఓపెన్​ చేసేందుకు కృషి చేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి హామీ ఇచ్చారు. గురువారం రాత్రి మందమర్రిలో ఆది జాంబవ సంఘం సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జడ్పీ చైర్​ పర్సన్​ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భారత  రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అనంతరం యాపల్​ఏరియా, రామకృష్ణాపూర్​ లోని సూపర్ బజార్​లో జరిగిన కాంగ్రెస్​ కార్నర్​ మీటింగ్​ల్లో పాల్గొని మాట్లాడారు. ఉదయం జైపూర్​ మండలం ఇందారంలో ఉపాధి కూలీలను కలిసి మాట్లాడారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలని కోరారు.  

బీఆర్ఎస్​కు గట్టి షాక్​

చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్​కు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన క్యాతనపల్లి మున్సిపాలిటీ కీలక నేత గాండ్ల సమ్మయ్య  గురువారం మంచిర్యాలలో తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే వివేక్ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. పార్టీలో చేరిన వారిలో బత్తుల శ్రీనివాస్​, రాజ్​కుమార్, నమిలికొండ వెంకటేశ్​, గొట్టె కుమార్, రామిడి రాజన్న, బత్తుల కుమార్, రాము, మారపెల్లి నరేశ్​ తదితరులు ఉన్నారు. మరోవైపు మందమర్రి మండలం చిర్రకుంట గ్రామానికి చెందిన బీఆర్ఎస్​ లీడర్, వార్డు సభ్యులు దుర్గం రమణకుమారి, యూత్​ లీడర్లు దుర్గం మనోహర్​, రాంటెంకి అశోక్, పొట్టాల శ్రీనివాస్, బీజేపీ లీడర్​ దుర్గం తిరుపతి తదితరులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి​ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.