
కోల్‌బెల్ట్, వెలుగు: సమస్యలు, డిమాండ్లను యాజమాన్యం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపాలని సింగరేణిలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగులు, ఆఫీసర్లు కోరారు. ఆదివారం మంచిర్యాలలోని ఇంట్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణి వ్యాప్తంగా 25 వేల మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు, ఆఫీసర్లు ఉన్నట్లు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో ఉన్న విధంగా సింగరేణిలోని ప్రతి ఏరియాలో ఒక బీసీ లైజన్ఆఫీసర్, సింగరేణి స్థాయిలో మరో చీఫ్లైజన్ ఆఫీసర్‌ను నియమించాలన్నారు. అసోసియేషన్‌కు ఒక బిల్డింగ్ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగ రిజర్వేషన్లు, హక్కులను కాపాడుకుంటూ పంజాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అసోసియేషన్ కొనసాగుతోందని చెప్పారు. బీసీ ఉద్యోగులు, ఆఫీసర్లు కలిసికట్టుగా ఉండాలని, సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానని ఎమ్మెల్యే వివేక్హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యేలను కలిసిన వారిలో సింగరేణి బీసీ అసోసియేషన్ ఫౌండర్ పంజాల శ్రీనివాస్, జనరల్సెక్రటరీ సముద్రాల శ్రీనివాస్, ఏరియా ప్రెసిడెంట్లు విజయప్రసాద్, డాక్టర్ మధుకుమార్, దీటి చంద్రమౌళి, ఐలయ్య, ఎం.నరేందర్, చీఫ్అడ్వైయిజర్ చిల్క శ్రీనివాస్, సెక్రటరీలు నాగెల్లి సాంబయ్య, చంద్రశేఖర్, సుధాకర్ ఉన్నారు.