సింగరేణి కాంట్రాక్ట్​ కార్మికులకు జీతం పెంచాలి: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

సింగరేణి కార్మికులకు బోసన్​ చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రజాభవన్​ లో జరిగింది.  ఈకార్య క్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, శ్రీధర్​ బాబుతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, కొత్తగూడెం  ఎమ్మెల్యే కూనంనేని పాల్గొన్నారు.ఈ సభలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకట స్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు.  కాంగ్రెస్​ ప్రభుత్వం సింగరేణి కార్మికుల పట్ల మంచి నిర్ణయం తీసుకుందని   ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు.  కాంట్రాక్ట్​ కార్మికుల జీతాలను పెంచే విషయాన్ని పరిశీలించాలని కోరారు.  సింగరేణి ఉద్యోగులకు పెన్షన్​ను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగేరిటైర్ట్​ ఉద్యోగులకు మెడికల్​ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు,

Also Read :- మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో అమిత్ షా భేటీ..

సింగరేణి కాంట్రాక్ట్​ కార్మికులకు రూ. 5 వేలు బోనస్​ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.  2023–24 సంవత్సరంలో రూ. 2,412  కోట్లు లాభాలు వచ్చాయి.  ఈ లాభాల్లో  లాభాల్లో 33 శాతం అనగా 796 కోట్లను కార్మికులకు  బోనస్​ గా ప్రకటించింది.  ఒక్కో కార్మి కుడికి లక్షా 90 వేలు బోనస్​ వచ్చింది.  గత ఏడాదితో పోలిస్తే   అదనంగా రూ. 20 వేల బోనస్​ అందుకున్నారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి ఉద్యోగులకు  బోనస్​ ప్రకటించడంపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి కృతఙ్ఞతలు తెలిపారు.