చెన్నూరు అభివృద్ధే నా లక్ష్యం.. : ఎమ్మెల్యే వివేక్

కాంట్రాక్టు కమీషన్లు కాదని.. చెన్నూరు నియోజకవర్గ అభివృద్దే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో పట్టణ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు ప్రజా సమస్యలపై అధికారుల తో రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..  అర్హులైన ప్రతి పేద వారికి రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పారు.  చెన్నూరు నియోజకవర్గంలో నాణ్యమైన విద్య,మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. గత పదేండ్ల కాలంలో మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు.  తాను ఎమ్మెల్యేగా గెలిచాక 100 కోట్ల సిఎస్ఆర్, డిఏంఎఫ్టీ నిధులతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు.

ALSO READ | చెన్నూరును క్లీన్ టౌన్‌గా మారుస్త

టీఎఫ్ఐడీసీ ద్వారా మరికొన్ని నిధులు తీసుకొచ్చి మందమర్రి మున్సిపాలిటీతోపాటు మందమర్రి రూరల్ ప్రాంతంలో అభివృద్ధి పనులను చేస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్.  మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.  మందమర్రి డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో అవకతవకలు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు అసత్యపు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.  వందలాది కోట్ల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పైన బిఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయొద్దని హితవు పలికారు. బీఆర్ఎస్ నాయకులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని సూచించారు. అధికారులు రీ సర్వే చేసి అర్హులైన లబ్దిదారులకు అందజేస్తారని చెప్పారు వివేక్.