విద్యారంగాన్ని బీఆర్ఎస్ విస్మరించింది: వివేక్ వెంకటస్వామి

విద్యారంగాన్ని బీఆర్ఎస్ విస్మరించింది: వివేక్ వెంకటస్వామి
  • చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • గత బడ్జెట్లో కేవలం 6శాతం కేటాయింపులు 
  • 11శాతం పెంపుదలకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నాలు

జైపూర్/చెన్నూరు: రాష్ట్రంలో విద్యా రంగాన్ని  గత బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా విస్మరించిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో రూ.30లక్షలతో నిర్మించిన మండల విద్యా మానవ వనరుల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బడ్జెట్ లో విద్యారంగానికి కేవలం 6శాతం కేటాయింపులు చేశార్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్  వచ్చే బడ్జెట్లో 10 నుంచి 11శాతం కేటాయింపులు పెంచి విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయనుందన్నారు.  చెన్నూరు నియోజకవర్గంలో పలు స్కూళ్లలో విద్యార్థులకు తగినన్ని క్లాస్ రూమ్స్​,   బిల్డింగ్డ్స్​ లేవనే  విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. మంచి విద్యతో ఉద్యోగాలు కూడా దక్కుతాయన్నారు. నియోజకవర్గ పరిధిలో త్వరలో రెండు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభించి యువతకు ఉపాది కల్పించనున్నట్లు తెలిపారు. సింగరేణి ఓసీపీలు, జైపూర్ పవర్ ప్లాంట్లో స్థానికులకు 80శాతం ఉద్యోగాలు కల్పించేలా ఆదేశాలు జారీ చేయించినట్లు చెప్పారు.   భీమారంలో ఆస్పత్రి, బస్టాండ్,  మార్కెట్ యార్డు,   సబ్ స్టేషన్, క్రికెట్ గ్రౌండ్ కోసం స్థలాలు కేటాయించాలని పలువురు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి వినతిపత్రాలు అందించారు.  అనంతరం ఆయన భీమారం కొదండరామాలయంలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఆయన వెంట  ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. 

క్రికెట్ విజేతలకు బహుమతులు అందించిన వివేక్

చెన్నూరు పట్టణంలో వారంపాటు నిర్వహించిన కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు  ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి బహుమతులు అందజేశారు. విన్నర్ జట్టుకు రూ.15వేలు క్యాష్, రన్నర్ జట్టు రూ.10వేల క్యాష్ ను సొంతగా  అందజేశారు.  అంతకు ముందు ఆయన కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. క్రీడాకారులతో ఉత్సాహంగా ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు  చెన్నూర్ లో   శ్రీ రాజరాజేశ్వర షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. ఆయన వెంట  మూల రాజిరెడ్డి, గొడిసెల బాపురెడ్డి, జుల్ఫకర్, మైదం రవి, హిమవంత్రెడ్డి, చల్ల రాంరెడ్డి, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  కాగా  కోటపెల్లి మండలంలోని సిర్సా,దేవులవాడ, కొల్లూరు గ్రామాల్లో ఇటీవలే చనిపోయిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు  గొడిషల మొండెయ్య, అసరెల్లి లక్ష్మి, జంగ అశోక్ రెడ్డి బాధిత కుటుంబాలను   ఎమ్మెల్యే వివేక్  పరామర్శించారు

 ఆలయాల్లో ప్రత్యేక పూజలు 

 చెన్నూరు నియోజకవర్గం భీమారం కోదండరామాలయం, జైపూర్ ఆంజనేయస్వామి ఆలయాల ను ఇవాళ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. అయోధ్య లో రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆలయాలల్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పూజలు చేశారు. ఆయనకు పండితులు వేద ఆశీర్వాదం చేశారు. భక్తుల తో ఎమ్మెల్యే వివేక్ కాసేపు మాట్లాడారు.. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు.