
తెలంగాణలో కాంగ్రెస్ 12 స్థానాల్లో గెలవబోతుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను సిఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని చెప్పారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఇష్టం వచ్చినట్లు పరిపాలన చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్చ వచ్చిందన్నారు. ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారని చెప్పారు.
మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఇటీవల మృతి చెందిన పలు మృతుల కుటుంబాలను వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. మందమర్రికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏండి ఖలీల్, జర్నలిస్ట్ హన్మండ్ల రవీందర్ తల్లి ఈశ్వరమ్మల చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మందమర్రిలోని రాజన్నల వాడకు చెందిన మదిరే అంజయ్య తనయుడు మదిరే శ్యామ్ సుందర్ ఈ రోజు గుండె పోటుతో మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.