కాకా ఎవ్వరికీ భయపడే వ్యక్తి కాదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పేదల కోసం ఎలాంటి ఓత్తిడి వచ్చినా వెనకడుగు వేయలేదన్నారు. రవీంద్ర భారతిలో కాకా జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి కాకా చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. కాకా నిరంతరం పేదల కోసం శ్రమించేవారని చెప్పారు. పేదల సంక్షేమం కోసం పరితపించేవారన్నారు.
ALSO READ | అభివృద్దికోసం కాకా సలహాలు తీసుకున్నాం: ఉపముఖ్యమంత్రి భట్టి
హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో కాకా వెంకటస్వామి జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈకార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, కాకా కుటుంబ సభ్యులు హాజరయ్యారు.