మన్మోహన్ సింగ్ ఒక విజనరీ లీడర్ అని అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అసెంబ్లీలో మన్మోహన్ మృతిపై సంతాప తీర్మానం సందర్భంగా మాట్లాడిన వివేక్.. దేశం రూపురేఖలు మార్చడంలో మన్మోహన్ కీ రోల్ పోషించారని చెప్పారు. మన్మోహన్ కు కాకా వెంకటస్వామికి మంచి అనుభందం ఉందన్నారు. రామగుండం ఫ్యాక్టరీ రీ ఓపెన్ కావడంలో మన్మోహన్ పాత్ర ఉందన్నారు వివేక్.
మన్మోహన్ హయాంలో దేశ జీడీపీ గ్రోత్ 8 ఉందన్నారు ఎమ్మెల్యే వివేక్. 2008లో ప్రపంచంలోని ఆర్థిక మాంధ్యం ఎఫెక్ట్ భారత్ పై పడలేదన్నారు. మన్మోహన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అని ఓబామా అన్నారని చెప్పారు. మన్మోహన్ హయాంలోనే యూఎస్ ట్రేడ్ పెరిగిందన్నారు వివేక్. మన్మోహన్ వల్లే ఐదు ట్రిలియన్ ఎకానమీ వైపు భారత్ పయనిస్తుందన్నారు. మన్మోహన్ సింగ్ వల్లే దేశంలో 2011 వరల్డ్ కప్ నిర్వహించారని.. క్రికెట్ మ్యాచ్ లకు రాయితీలు ఇచ్చారని వివేక్ చెప్పారు.