- కాంట్రాక్టర్లు దోచుకునేందుకే కేసీఆర్ తెచ్చిండ్రు
- పేదలు మురికి నీళ్లు తాగడానికి కేసీఆర్ కారణం
మందమర్రి మున్సిపాలిటీ వార్డులో మార్నింగ్ వాక్ లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోల్బెల్ట్ : కేసీఆర్ మిషన్ భగీరథ స్కీమ్ను పదేళ్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే అమలు చేసిండని చెన్నూరు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఇవాళ మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలోని 1,2,22 వార్డుల పరిధిలోని యాపల్, వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి కృషి అబ్రహాంనగర్, సింగరేణి జీఎం ఆఫీస్ ఏరియాల్లో నిర్వహించిన మార్నింగ్ వాక్ లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పా ల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి సమ స్యలు అడిగితెలుసుకున్నారు. సమస్య పరిష్కారా నికి చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆఫీసర్లను ఎమ్మెల్యే వివేక్ ఆదేశించారు. యాపల్ లో కాలనీ వాసులు తమకు మిషన్ భగీరథ ద్వారా మురికి, వాసనతో కూడిన నీళ్లు వస్తున్నాయని, బాటిల్స్ లో పట్టిన వాటర్ ను ఎమ్మెల్యేకు చూపించారు.
ALSO READ | అభిమాని బర్త్డే జరిపిన వివేక్ వెంకటస్వామి
ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా కాలంగా తాను మిషన్ భగీరథ ఒక పెద్ద అవినీతి స్కీమ్ అని చెప్తుతున్నానని, ఎక్కడ కూడా నీళ్లు సరిగా రావ డంలేదన్నారు. మురికి, వాసనతో కూడిన నీళ్లను ప్రజలు ఎలా తాగుతారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ కేవలం కమిషన్ల కోసం, కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు ఈ స్కీం తీసుకువచ్చింది, తాగునీటి కోసం రూ. 30 కోట్లతో మందమర్రి మున్సిపాలిటీ ప్రజలు కష్టాలు దూరం చేసేందుకు కొత్తగా వాటర్ స్కీంను తీసుకువస్తం. దీంతో ప్రతిఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తం. ఈ నెల ఫ్టస్ వీక్ లోనే స్కీం పనులను భూమిపూజ చేస్తామని ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి తెలిపారు.
వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి కృషి
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో పదేండ్లుగా ఎలాంటి అభివృద్ధి జరుగలేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సైడ్ డ్రైనేజీలు, రోడ్లు, తాగునీటి సౌలత్లు లేక స్థానిక ప్రజలు ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. సైడ్ డ్రైన్స్, రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక ఫండ్స్ కేటాయిస్తు న్నట్లు చెప్పారు. కాలనీలో సులబా కాంప్లెక్, బస్ స్టాఫ్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దోమల నివారణకు తరచూ వార్డుల్లో ఫాగింగ్ చేయించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లును ఆదేశించారు. యాపల్ ఏరియాలోని బస్తీ దవాఖాన లో మందుల కొరత, సరిగ్గా డాక్టర్లు రాకపోవ డంపై స్థానికులు ఎమ్మెల్యేకు కంప్లైట్ చేశారు. సమస్య పరిష్కారానికి సంబంధిత డాక్టర్లతో ఆయన మాట్లాడారు. అబ్రహాం నగర్ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు స్థలం కావాలని స్థానికులు కోరాగా ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సింగరేణి జీఎం దేవేందర్ తో ఫోన్లో మాట్లాడి కమ్యూనిటీ హాల్ కోసం స్థలాలు కేటాయించాలని ఆదేశించారు. మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధి పథంలోకి తీసుకువస్తానని, ఒక్కొక్కటిగా ప్రియారిటీ పరంగా అభివృద్ధి పనులు చేస్తామన్నారు.