మార్చిలో స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్లు : వివేక్​ వెంకటస్వామి

  •     చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి

కోల్​బెల్ట్​, వెలుగు : మార్చి చివరి కల్లా మందమర్రి, చెన్నూరులో స్కిల్ ​డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్లను ప్రారంభిస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు.  సింగరేణిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు.  80 శాతం స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం రేవంత్​రెడ్డి ద్వారా సింగరేణి నుంచి ఆదేశాలు జారీ చేయించినట్లు స్పష్టం చేశారు. చెన్నూరు నియోకవర్గంలో కొత్త గనులు రావాల్సి ఉందని,  జైపూర్​ పవర్​ ప్లాంట్​ విస్తరణలో భాగంగా 850 మెగావాట్ల మూడో యూనిట్​ ఏర్పాటుకు కార్యాచరణ జరుగుతుందన్నారు.  

మిషన్​ భగీరథలో పాత పైపులు వేశారని పలుచోట్ల పైపులు డ్యామేజ్​, లీకేజీలు కావడంతో  నీళ్ల సప్లై కావడం లేదన్నారు. లోపాలను గుర్తించేందుకు కమిటీ ద్వారా ఎంక్వయిరీ చేశామని, 166 హాబిటేషన్లలో 70 హబిటెషన్లలో డ్యామేజ్​, లోపాలను గుర్తించారని, మార్చి చివరిలోగా నియోజకవర్గంలో ఇంటింటికీ తాగునీరు సప్లై కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.  నేషనల్​ హైవే రోడ్ల నిర్మాణంతో డ్యామేజ్​ అయిన మిషన్​ భగీరథ పైపులైన్లు, డ్రైనేజీలకు తిరిగి రిపేర్లు చేసేందుకు  హైవే అధికారులు హామీ ఇచ్చారన్నారు.

నియోజకవర్గంలో ఈజీఎస్​ కింద రూ.5 కోట్ల వరకు రోడ్లకు కేటాయించేందుకు  మంత్రి సీతక్క ఆదేశాలు ఇచ్చారన్నారు.  ఈ 50  రోజుల్లో నియోజకవర్గంలో ఎమ్మెల్యేను కలవడం, సమస్యలు చెప్పేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు.  ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కలవడానికి చాలా కష్ట పడాల్సి వచ్చేదని, సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు ఈజీగా కలుస్తున్నారన్నారు.  అంతకు ముందు ఆయన గాంధారీవనంలో  కాంగ్రెస్​ లీడర్ బండి సదానందం ఏర్పాటు చేసిన సహపంక్తి భోజన కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ లీడర్లు పాల్గొన్నారు.