- చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- సింగరేణి సింటార్స్ సెంటర్ సందర్శన
- కార్మెల్ హైస్కూల్ డైమాండ్ జూబ్లి వేడుకలకు హాజరు
కోల్‌బెల్ట్,వెలుగు : క్యాతనపల్లి మున్సిపాలిటీ తొమ్మిదో వార్డులో అభివృద్ధి పనులను త్వరగా చేపట్టాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం ఉదయం మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ లీడర్లు, కాలనీ వాసులతో కలిసి అమ్మగార్డెన్ ఏరియాను ఆయన సందర్శించారు. రోడ్లు, డ్రైయినేజీ నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ సదాశివరెడ్డి, మున్సిపల్ఏఈ అచ్యుత్, ఇతర అధికారులను ఆదేశించారు.
మందమర్రిలోని సింగరేణి సింటార్స్సెంటర్ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కలిసి సందర్శించారు. సెంటర్లో స్కిల్డ్ డెవలప్మెం ట్‌పై ఇస్తున్న శిక్షణ, ఏర్పాట్లపై మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ. మనోహర్, ఎస్ఓటుజీఎం రాజేశ్వర్‌రెడ్డి, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు గుడ్ల రమేశ్, తిరుమల్, సట్ల సంతోష్ పాల్గొన్నారు.
కార్మెల్ హైస్కూల్ డైమాండ్ జూబ్లి వేడుకల్లో...
మందమర్రి పట్టణంలోని కార్మెల్ హై స్కూల్ స్థాపించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం రాత్రి నిర్వహించిన డైమాండ్ జూబ్లీ వేడుకల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, సీనియర్ జర్నలిస్టు ఎండి.మునీర్, స్కూల్ యాజమాన్య ప్రతినిధులు హాజరయ్యారు.
ALSO READ: బీఆర్ఎస్ కౌన్సిలర్ భూములపై ఫారెస్ట్ అధికారుల దాడులు
కరాటే పోటీల విజేతలను అభినందించిన వివేక్
బెల్లంపల్లిలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ పలు బహుమతులు సాధించిన రామకృష్ణాపూర్ తవక్కల్ హైస్కూల్ విద్యార్థులను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ అభినందించారు. కార్యక్రమంలో స్కూల్ కరస్పాటెండెంట్, కాంగ్రెస్ లీడర్ ఎండీ.అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.