ప్రతిపక్షాలది ఫేక్ ప్రచారం : వివేక్ వెంకటస్వామి

ప్రతిపక్షాలది ఫేక్ ప్రచారం :   వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: దేశంలో కులగుణన జరగాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ చెప్పారు, దీనికి అనుణంగా రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి కులగణన స్టార్ట్ చేస్తున్నారని చెన్నూరు ఎమ్మె ల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. అక్టోబర్ 30న  గాంధీ భవన్లో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.. ప్రభుత్వం సామాజిక వర్గం వారీగా రాష్ట్రంలో ఉన్న ప్రజల లెక్కలను తీసుకుంటుందన్నా రు. సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.  

మొన్న జరిగిన గ్రూప్ వన్ పరీక్షల వ్యవహారంలో అపోహలు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల సెలక్షన్ వివరాలను సీఎం స్వయంగా వివరించారు. గ్రూప్ వన్ రిజల్ట్ అగ్రవర్ణాల వారికే మేలు జరిగిందని అపోహలు వచ్చాయి. దీనికి సీఎం క్లారిఫికేషన్ ఇచ్చారు. 90 శాతం పైగా ఎస్సీ ఎస్టీ ఓబీసీల వర్గాల బిడ్డలే సెలెక్ట్ అయ్యారని సీఎం చెప్పారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై ప్రతిపక్షపార్టీలు అసత్య ప్రచారం చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుంది' అని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.