కోల్‌బెల్ట్,వెలుగు : పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందుతుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం మంచిర్యాల హైటెక్ సిటీలోని ఎమ్మెల్యే నివాసంలో బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ 12 వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్బొద్దున రమ్య-ప్రేమ్‌సాగర్, మందమర్రి సహకార సంఘం చైర్మన్ ఎస్.ప్రభాకర్‌రావు, ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ బత్తుల రాజ్‌కుమార్‌తో పాటు పలువురు మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు, జైపూర్ మండలం ఇందారం పంచాయతీ వార్డు సభ్యులు వైద్య శ్రీధర్, అల్లాడి రామకృష్ణ వైద్య నరసయ్య, వల్లాల భాను, వడల శ్రీనివాస్, పొన్నగంటి శ్రీనివాస్, కారంగుల రంజిత్, నల్లవెల్లి రాజేష్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
నూతన వధువరులను ఆశీర్వదించిన వివేక్
క్యాతనపల్లి మున్సిపాలిటీలోని భీమా గార్డెన్స్‌లో జరిగిన రాజేశ్-ప్రత్యూష పెండ్లికి , మంచిర్యాల పద్మనాయక ఫంక్షన్ హాల్లో వెలుగు స్టాప్ రిపోర్టర్ చౌదరి సురేశ్-శ్రీలత దంపతులు కూతురు జ్యోతిర్మయి నూతన వస్ర్తాలంకరణ వేడుకలకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులను, జ్యోతిర్మయిని ఆశీర్వదించారు.
వంశీకృష్ణకు మద్దతుగా ప్రచారం ..
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా బుధవారం మందమర్రి పట్టణంలోని 24 వార్డుల్లోని 42 బూత్‌ల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నోముల ఉపేందర్‌గౌడ్, సీనియర్ లీడర్ సొతుకు సుదర్శన్,పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మండ భాస్కర్, సెక్రటరీ బత్తుల రమేశ్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ నెర్వెట్ల శ్రీనివాస్, మహిళ విభాగం ప్రెసిడెంట్ గడ్డం రజనీ, మైనార్టీ ప్రెసిడెంట్ జమీల్, ఎన్ఎస్యూఐ స్టేట్ లీడర్ అర్జున్ మహంతో తదితరులు పాల్గొన్నారు.