ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని సన్మానించిన బట్టి గూడెం కాలనీ వాసులు


మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. బట్టి గూడెం కాలనీలోని శ్రీ లక్ష్మీ దేవీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అంతకుముందు కాలనీవాసులు వివేక్ వెంకటస్వామిని  సన్మానించారు. స్థానికులతో కలిసి కాలనీలో తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.