గోదావరిఖని, వెలుగు : గోదావరిఖనిలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గురువారం పరామర్శించారు. స్థానిక హనుమాన్ నగర్లో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాయిని మధునయ్య నివాసానికి వెళ్ళి ఆయన చిత్రపటం వద్ద పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. మధునయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
మధునయ్యకు కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి, తనతో ఉన్న అనుబంధాన్ని వివేక్ గుర్తు చేసుకున్నారు. అలాగే స్థానిక సూర్యనగర్లో అనారోగ్యంతో మృతి చెందిన కార్మిక నేత కెంగెర్ల మల్లయ్య తల్లి నర్సమ్మ చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. వివేక్ వెంకటస్వామి వెంట లీడర్లు పి.మల్లికార్జున్, ఎం.రవికుమార్, గడ్డం మధు, మగ్గిడి దీపక్, మల్లేశ్ యాదవ్, తిప్పారపు మధు, కోరం నరేందర్ రెడ్డి, గుమ్మడి సంపత్ తదితరులున్నారు.