గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని లక్ష్మీనగర్ నివాసి, వ్యాపారి శ్యామ్సుందర్శర్మ ఇటీవల చనిపోయాడు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గురువారం రాత్రి వారి నివాసానికి వెళ్లి శర్మ ఫొటో వద్ద పూలు వేసి నివాళులర్పించారు.
శర్మ కుమారుడైన కన్య్జూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్‌శర్మ, ఇతర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. వివేక్ వెంట రామగుండం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పి.మల్లికార్జున్, లీడర్లు కామ విజయ్, సంజీవ్, మధు, తదితరులున్నారు.