జనాభా లెక్కలు తీయనిది.. వర్గీకరణ ఎలా చేస్తారు.?: ఎమ్మెల్యే వివేక్

జనాభా లెక్కలు తీయనిది.. వర్గీకరణ ఎలా చేస్తారు.?: ఎమ్మెల్యే వివేక్

జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడిన వివేక్.. జనాభా లెక్కలు తీయనిది వర్గీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు . 

 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాలల  సభ పెట్టింది ఈ డిమాండ్స్ పైనే అని చెప్పారు వివేక్.  ఏ వర్గానికి వ్యతిరేకంగా తాము  సభ పెట్టలేదన్నారు. ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్లు పెంచాలన్నారు. మాల ,మాదిగలకు వ్యత్యాసం 7 లేదా 8 శాతమేనని చెప్పారు.  రిజర్వేషన్లు కూడా పెంచితే ప్రభుత్వానికి మంచి పేరొస్తుందన్నారు వివేక్.

Also Raed : అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్

పంజాబ్ హర్యానా, బీహార్ లో రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేశారని చెప్పారు ఎమ్మెల్యే వివేక్.  మాలల్లో ఆందోళన ఉంది.  బడ్జెట్ లో ఎస్సీలకు 18 శాతం నిధులు కేటాయించాలన్నారు.  ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ అధ్యయనంచేసి అమలు చేయాలన్నారు.  చేవేళ్ల డిక్లరేషన్ ప్రకారం. మాల,మాదిగ కార్పొరేషన్లు స్థాపించాలన్నారు. నేతకాని కులానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. వచ్చే బడ్జెట్ లో ఈ మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశామన్నారు వివేక్.