విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు ఇవ్వాలి : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు ఇవ్వాలి : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు ఇవ్వాలని కేంద్రంపై వత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నిన్న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చి తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం కేంద్రం వివక్షకు నిదర్శనమన్నారు వివేక్ వెంకటస్వామి. 

చిన్న రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ ప్రజలుగా మనం కేంద్రానికి దాదాపు లక్ష కోట్లు ట్యాక్స్ కడుతున్నామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అయితే కేంద్రం నుంచి తెలంగాణ నిధులు కేటాయింపులో అన్యాయం జరుగుతోంది. రాష్ట్రానికి 100 రూపాయలు కేంద్రానికి ఇస్తే అందులో 27 రూపాయలు మాత్రమే రాష్ట్రానికి అందుతున్నాయి.  యూపీ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రా్ల్లో లక్ష కోట్లు కేంద్రానికి ఇస్తే.. కేంద్రం ఆ రాష్ట్రాలకు రెట్టింపు నిధులు అంటే రెండు లక్షల కోట్లు నిధులు విడుదల చేస్తోందన్నారు. నిధులు కేటాయింపు విషయంలో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు. 

ఇవాళ బీఆర్ ఎస్ నేతలు తెలంగాణకు నిధులు తేవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అంటున్నారు. .గత పదేళ్లలో కూడా కేంద్రం తెలంగాణకు నిధులు కేటాయించలేదు.. అప్పుడేం చేశారని ప్రశ్నించారు. అందరం కలిసి కేంద్రం నుంచి నిధులు రాబట్టాల్సిన అవసరం ఉందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.