మంచిర్యాల: కాంగ్రెస్ పార్టీ పోడు రైతులను సమస్యలను పరిష్కరిస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంటకస్వామి అన్నారు. చెన్నూరు నియోజకవర్గం పరిధిలో పోడు భూముల సమస్య ఉంది.. గత కొన్ని రోజులుగా పోడు రైతులు, అటవీ అధికారుల మధ్య వివాదం తలెత్తింది. చాలా మంది పోడు రైతులపై అటవీ శాఖ అధికారులు కేసులు పెట్టారు.
పోడు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. డిప్యూటీ సీఎం పోడు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కాస్తులో ఉన్న రైతులు, పట్టా ఉన్న రైతులు డిస్ట్రబ్ చేయొద్దని అధికారులకు సూచించారు. కొత్తగా అటవీ భూములను ఆక్రమించే ప్రయత్న చేస్తే చర్యలు తప్పవన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
శుక్రవారం (జూలై 12) చెన్నూరు ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో పోడు భూములపై కలెక్టర్, అటవీ శాఖ అధికారులు, రైతులతో కలిసి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమావేశం నిర్వహించారు.చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్, మండలాల్లోని పోడు భూముల సమస్యలపై రైతులతో మాట్లాడారు. కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీఎఫ్ ఓ శివ ఆశీష్ సింగ్, చెన్నూరు ఎప్డీవో రమేష్ లతో చర్చించి రైతుల సమస్యల పరిష్కారం దిశగా కృషి చేశారు.