పెద్దపల్లి జిల్లా ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్ల నాయక్ ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. కొన్ని రోజుల క్రితం రూప్లనాయక్ తండ్రి రత్న నాయక్ అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో జనవరి 18న బంజేరుపల్లె గ్రామంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు వివేక్ రత్న నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే వివేక్ వెంట ధర్మారం కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఉన్నారు ఉన్నారు.
చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దాదాపు వంద కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.