చెన్నూరు శనిగకుంట చెరువు మత్తడి ధ్వంసం కేసులో ఏడుగురు అరెస్ట్

చెన్నూరు శనిగకుంట చెరువు మత్తడి ధ్వంసం కేసులో ఏడుగురు అరెస్ట్

మంచిర్యాల: చెన్నూరు పట్టణ శివారులోని శనగకుంట చెరువు మత్తడి ధ్వంసం కేసులో పోలీసుల విచారణ వేగంగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కుతరలించారు. తాజాగా మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

సెప్టెంబర్ 18న చెన్నూరు పట్టణంలోని శనిగకుంట చెరువు మత్తడిని గుర్తు తెలియని వ్యక్తులు డిటోనేటర్లుపెట్టి పేల్చి ధ్వంసం చేశారు. చెరువు మత్తడి కాంక్రీటు నిర్మాణాన్ని 15 నుంచి 20 మీటర్ల మేరకు ధ్వంసం చేశారు. భారీ వర్షాలతో నిండు కుండలా ఉన్న చెరువును పేల్చివేయడంతో నీరంతా వృధాగా పోయింది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ధ్వంసమైన మత్తడిని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులు ఆదేశించారు. నిందితులనుకఠినంగా శిక్షిస్తామని చెప్పారు. 

Also Read :- మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన రాజామౌళి

ఆయకట్టు రైతులు నష్టం కలిగించేదుకు ఉద్దేశపూర్వకంగా పేల్చివేశారా.. నేషన్ హైవే63ని ఆనుకొని ఉన్న చెరువు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉండటంతో చెరువు నిండా నీళ్లను బయటకు పంపించేందుకు పేల్చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.