చెన్నూరును రోల్ మోడల్గా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

చెన్నూరును రోల్ మోడల్గా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గంలోని సోమన్పల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ శంకుస్థాపన చేశారు. సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులతో పలు అంశాలపై మాట్లాడారు.

INTUC, సింగరేణి కార్మికులు, సింగరేణి అధికారులు.. ఎమ్మెల్యే, ఎంపీని సన్మానించారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కార్మికులతో కలిసి భోజనాలు చేశారు. అనంతరం.. ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, పదేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీలను పట్టించుకోలేదని, తాను చెన్నూరులో మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు రోడ్లు డ్రైనేజీలు బాలేవని ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని ఎమ్మెల్యే చెప్పారు.

Also Read :- ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ ఎందుకు తప్పుపడుతున్నారు

చెన్నూర్ టౌన్, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. చెన్నూరులో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్, కరీంనగర్కు వెళ్లాల్సిన పని లేదని చెప్పారు. మంచి వైద్యం అందుబాటులో ఉంటుందని, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశామని, క్యాన్సర్ పేషెంట్ల కష్టాలు తీర్చామని ఎమ్మెల్యే గుర్తుచేశారు. చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు తనకు సహకరించాలని, రాష్ట్రంలోనే చెన్నూరు నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాటిచ్చారు.

ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇంకా ఏమన్నారంటే..

* మిషన్ భగీరథ ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరిగాయి

* కాంగ్రెస్ ప్రజా పాలనలో ఎవ్వరూ నష్టపోకుండా చూస్తాం

* చెన్నూర్ ప్రాంతాన్ని అమృత్ స్కీం ద్వారా 30 కోట్లతో పనులు ప్రారంభించాం

* వంద కోట్లతో చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి

* అన్ని  గ్రామాల్లో మంచినీటికి కరువు ఉండేది.. సుమారు వంద బోర్ వేల్స్ వేసి నీటి ఎద్దడి లేకుండా చూశాం

 * చెన్నూర్ ప్రాంతంలో ఫారెస్ట్ ప్రాంతం ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి

* 100 కోట్లతో జోడు వాగులు రోడ్డు పనులకు నిధులు మంజూరు చేశాం

* చెన్నూర్ టౌన్, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

* 125 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ బిల్డింగ్కి  శంకుస్థాపన చేశాం

* చెన్నూర్లో శాండ్ మాఫియా, పేకాట, అక్రమ దందాలు జరిగితే సహించేది లేదు

* ఇక్కడ పని చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. అభివృద్ధి చేస్తాను.

* ప్రజల అవసరాలను తీర్చి అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తాను

* అన్ని వర్గాల వారికి పనులు సక్రమంగా చేయడానికి ప్రణాళికలు రూపొందించాను