
-
ఉద్యోగుల పెంపునకు కొత్త గనులు అవసరం
-
సొంతింటికల నెరవేర్చుతం
-
ఎన్నికల్లో ఐఎన్టీయూసీని గెలిపించండి
-
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కోల్ బెల్ట్: సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉందని, సర్కార్ చేతిలో ఉన్న సంస్థను ఎట్టి పరిస్థితిలో ప్రైవేటీకరణ చేయబోమని, కార్మికులు అపోహలు వీడాలని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ గనులు, డిపార్ట్మెంట్లపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో వివేక్ మాట్లాడారు.
తెలంగాణలో అతిపెద్ద కంపెనీ సింగరేణిని రాష్ట్ర సర్కార్ పరిరక్షిస్తుందని, సీఎం రేవంత్రెడ్డి కార్మికులకు అండగా ఉంటారన్నారు. చెన్నూరు ప్రజలు తనను భారీ మోజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించారని, వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ‘కాకా కొడుకుగా పుట్టడం నా అదృష్టం. నాన్న ఇచ్చిన ధైర్యంతోనే కేసీఆర్తో పోరాడిన... కాళేశ్వరం అవినీతిపై తొలిసారిగా మాట్లాడింది నేనే. ...నష్టాల బాటలో ఉన్న సింగరేణి సంస్థను కాపాడేందుకు కాకా వెంకటస్వామి రూ.400 కోట్లను ఎన్టీపీసీ నుంచి ఇప్పించారు అని గుర్తు చేశారు.
కొత్త గనులు తెస్తం
సింగరేణిని ప్రైవేట్ పరం చేయమని, బొగ్గు బ్లాకులు అదానీకి కట్టబెట్టబోమని చెన్నేరు ఎమ్మెల్యు వివేక్ వెంకటస్వామిస్పష్టంచేశారు. కార్మికులకు 250 గజాల ఇంటిస్థలం, రూ.20 లక్షల వడ్డీ లేని రుణం ఇచ్చి.. సొంతింటి కల నెరవేర్చుతామన్నారు. పెర్స్క్ పై ఐటీని సింగరేణి భరిస్తుందని, మహిళ ఉద్యోగులకు గౌరవం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ సర్కార్ కొత్త బొగ్గు గనులు తీసుకువస్తుందని, ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ నుంచి ఐఎన్టీయూసీలో చేరిన లీడర్లకు కండువాలు కప్పి ఆహ్వానించారు.