3వ రోజు కొనసాగుతున్న భూ నిర్వాసితుల దీక్ష

మర్రిగూడ, నల్గొండ జిల్లా:  డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన చర్లగూడెం రిజర్వాయర్ కింద భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులు ఆందోళన ఇవాళ మూడో రోజుకు చేరుకుంది. ఆర్​ అండ్​ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మర్రిగూడ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. ఖుదాబక్షపల్లి, రాంరెడ్డిపల్లి, లోయపల్లి, అజిలాపురం నిర్వాసితులు చేపట్టిన నిరవధిక దీక్షకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం సందర్శించి​ సంఘీభావం తెలుపగా.. ఇవాళ మరికొందరు రాజకీయ పార్టీల నాయకులు సందర్శించి పార్టీలకు అతీతంగా మద్దతు ప్రకటించనున్నారు. 

ప్రాజెక్టు పనులను నిన్న నిర్వాసితులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యంలో ఇవాళ మర్రిగూడ తహసీల్దార్ ఆఫీసు వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖుదబక్ష్ పల్లి, రాంరెడ్డిపల్లి, లోయపల్లి, అజిలాపురం  గ్రామ నిర్వాసితులు మూడో రోజు నిరసనలు కొనసాగిస్తుండడం చర్చనీయాంశం అయింది.