హైదరాబాద్, వెలుగు: నల్గొండ, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్‌ఎస్ ఎన్నికల ఇన్‌చార్జిగా సీనియర్ నేత చెరుకు సుధాకర్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, చెరుకు సుధాకర్ కొన్ని రోజుల క్రితమే బీఆర్ఎస్‌లో చేరారు. పార్టీలో ఆయన సేవలు వినియోగించుకునేందుకే రెండు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిగా పార్టీ నాయకత్వం నియమించింది.