రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు కన్నుమూశారు. హైదరాబాద్ లో ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన.. తెల్లవారుజామున నాలుగు గంటల 50 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో బాధపడ్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హాస్పిటల్ లో చేర్చారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి పార్థివ దేహాన్ని తరలించారు కుటుంబ సభ్యులు.
1936 , నవంబర్ 16 న కృష్ణాజిల్లా పెదపారిపూడిలో జన్మించారు రామోజీరావు. ఆయన అసలు పేరు చెరుకూరి రామయ్య. చెరుకూరి గ్రూప్ పేరుతో ఎన్నో సంస్థలు నడిపారు రామోజీరావు. ఈనాడు, మార్గదర్శి, ప్రియా పచ్చళ్లు, సితార మేగిజైన్లు రన్ చేశారు. ఇక సిటీ శివారులోని రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనో అతి పెద్ద ఫిల్మ్ సిటీగా పేరుగాంచింది. ఆయన సేవలకు గాను 2016 లో పద్మవిభూషణ్ తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.