చెర్వుగట్టులో భక్తి శ్రద్ధలతో అగ్ని గుండాలు..భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

చెర్వుగట్టులో భక్తి శ్రద్ధలతో అగ్ని గుండాలు..భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
  • శివనామస్మరణతో మారుమ్రోగిన చెర్వుగట్టు

నార్కట్‌‌‌‌పల్లి, వెలుగు : ‘హర హర మహాదేవ శంభో శంకర’ అన్న నినాదంతో శుక్రవారం తెల్లవారుజామున చెర్వుగట్టు మారుమ్రోగింది. నల్గొండ జిల్లా నార్కట్‌‌‌‌పల్లి మండలం చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అగ్నిగుండాల ఘట్టాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివచ్చారు. దేవాలయ ప్రధాన అర్చకుడు పోతులపాట్టి రామలింగేశ్వరశర్మ, శ్రీకాంత్‌‌‌‌శర్మ, సురేశ్‌‌‌‌ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య స్వామివారిని గరుడ వాహనంపై అగ్నిగుండం వరకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం శివసత్తులు, భక్తులు అగ్నిగుండాల్లో నడిచారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ నాగరాజు, ఎస్సై క్రాంతికుమార్‌‌‌‌ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎన్.అశోక్‌‌‌‌రెడ్డి, బ్రహ్మోత్సవాల ప్రత్యేకాధికారి కృష్ణ, దేవాదాయ అసిస్టెంట్‌‌‌‌చెర్వుగట్టులో భక్తి శ్రద్ధలతో అగ్ని గుండాలు..భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులుకమిషనర్‌‌‌‌ భాస్కర్, ఈవో నవీన్ కుమార్, సీనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ ఇంద్రసేనారెడ్డి, ఇరిగెల శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఊషయ్య, మాజీసర్పంచ్‌‌‌‌ నేతగాని  కృష్ణయ్య పాల్గొన్నారు.