నార్కట్పల్లి,వెలుగు: చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం అన్నదానానికి బీబీనగర్ మండలం కొండమడుగు మాజీ సర్పంచ్ సుర్వి వేణు గౌడ్ 5లక్షల చెక్కును దేవస్థాన అధికారులకు అందజేశారు. మునుగోడు ఎమ్మెల్యే గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే అన్నదానానికి ఐదు లక్షలు చెల్లిస్తానని మొక్కుకున్నానని, బుధవారం మొక్కులు చెల్లించి 5లక్షల చెక్కును అందించినట్టు తెలిపారు.
అనంతరం కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జ్ఞాపకర్ధం ఆలయ ఉద్యోగులకు సిబ్బందికి, అర్చకులకు చీరలు, బట్టలు పంపిణీచేశారు . కార్యక్రమంలో దేవాలయ సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వడ్డే భూపాల్ రెడ్డి,అశోక్, చిక్కుల శివ,నవీన్ తదితరులు ఉన్నారు.