- హాజరుకానున్న మంత్రి జగదీష్ రెడ్డి
- నేటి నుంచి 13 వరకు సాగనున్న జాతర
నల్గొండ జిల్లాలో ఇవాళ్టి నుంచి చెర్వుగట్టు జాతర షురూ కానుంది. ఈ రోజు నుంచి ఈ నెల 13 వరకు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగునున్నాయని అధికారులు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించనున్నారు. 8న స్వామి వారి కల్యాణం, 9న శేషవాహన సేవ, 10న అగ్నిగుండాలు,11న దీపోత్సవం, 12న పుష్పోత్సవం,13న గ్రామోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారని, అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 680 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని, కోవిడ్ కు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం: