చెర్వుగట్టు శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆదాయం 34 .97 లక్షలు

నార్కట్​పల్లి వెలుగు: మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి రూ.34.97 లక్షల ఆదాయం వచ్చింది. గత 52 రోజులుగా స్వామివారి హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను  మంగళవారం  ఎండోమెంట్‌‌ జిల్లా సహాయ కమిషనర్​  మహేంద్ర కుమార్,  ఈవో నవీన్​, ఆలయ ప్రధాన అర్చకులు రామలింగేశ్వర శర్మ, సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో లెక్కించారు.  

రూ.34, 97, 65000 వచ్చినట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్లు ఇంద్రసేనారెడ్డి, శంకర్, రవీందర్ రెడ్డి,  సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, రాజయ్య, నర్సిరెడ్డి పాల్గొన్నారు.