శివనామస్మరణతో మార్మోగిన చెర్వుగట్టు ఆలయం

నల్గొండ జిల్లా నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలం చెర్వుగట్టు ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున రామలింగేశ్వరుడి కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవ మూర్తులను ఉదయం 4.30 గంటలకు నంది వాహనంపై కల్యాణమండపానికి తీసుకొచ్చారు. నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డి స్వామివారికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందజేశారు. అనంతరం వేద పండితులు అల్లవరం సుబ్రహ్మణ్యశాస్త్రి, నీలకంఠశాస్త్రి, ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో మాంగల్యధారణ, తలంబ్రాలు పోసే కార్యక్రమాన్ని నిర్వహించారు.  శివపార్వతుల కల్యాణాన్ని చూసేందుకు భక్తుల భారీ సంఖ్యలో హాజరయ్యారు. భక్తుల రద్దీ కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ నర్సింహారెడ్డి పర్యవేక్షణలో నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి సీఐ శివరాంరెడ్డి, ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేకల అరుణ రాజిరెడ్డి, ఈవో నవీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.    

- వెలుగు ,నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి/వెలుగు ఫొటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నల్గొండ